శరణం చరణం
శ్రీ గురు చరణ సరోజ రజ
నిజమన ముకురు సుధారి
వరణౌ రఘువర విమల జసు జోదాయక ఫలచారి
బుద్ధి హీనతను జానికై సుమిరౌ పవన కుమార్
బల బుద్ధి విద్యా దేహు మోహి
హరహు కలేస బికార్
శివోహం,
గురుభ్యోం నమః
ఈ మాయా ప్రపంచం లో అజ్ఞాన అంధకారం లో దిక్కు తోచక దారి తెలియక
నీ జాడ కనుగొన లేక ,ఆశ మోహాలకు లోనై,అరిషడ్వర్గాలకు బానిసై
నీకు దూరమై ,జంతువులతో పోటీగా తిని తాగుతూ తుళ్ళుతూ
సంసారం చేస్తూ , ఆ జంతువులకే అసహ్యం కలిగేలా జీవిస్తూ ,
క్షణిక సుఖాలకోసం వెంపర్లాడుతూ , అమృత తుల్యమైన మానవ జన్మను
నరక ప్రాయం గా మార్చుకుంటూ ,బాధల్లో నిన్ను విమర్శిస్తూ
సుఖాల్లో సత్ చిత్ ఆనంద స్వరూపుడవైన నిన్ను విస్మరిస్తూ
ఈ గాడాంధకారం నిండి ఉన్న మనస్సుతో చరిస్తున్న నా పై
నీ చల్లని వెన్నెల జల్లులతో ,లోకమంతా నీ వెలుగు నిండి ఉన్నా
గుర్తించలేని ఈ గుడ్డివాడిని కరుణిస్తూ, నీ కృపా దృష్టి తో నన్ను వీక్షించి
నీ దివ్య మంగళ స్వరూపాన్ని చూసే మహాద్బాగ్యాన్ని ప్రసాదించు తండ్రీ ...!!!
ఈ జనన మరణ చక్రం నుండి విడివడే ,నీ సాయుజ్యాన్ని పొందే
దారిని చూపి ధన్యుని చేయుము ప్రభో ...!!!
తుచ్చ మైన ఆలోచనలతో ఉన్న మనసుకు ,నీచమైన మాటలతో
క్రుళ్ళిన లాలాజలం లో ఓల లాడుతూ ఉన్న నా నాలుకకు
సుగుణాభి రాముడివైన నిన్ను కీర్తించగలిగే భాగ్యాన్ని ప్రసాదించుము దేవ దేవా...!!!