Monday, October 4, 2010

Guru brahma Guru Vishnu Gurudevo maheshwara



                                                                          

జై గురు దత్తా శ్రీ గురు దత్తా ,

కల్మష రహిత మైన ప్రార్ధన కి కరిగే కరుణా సముద్రుడు ,మన చుట్టూ ఆవరించి ఉన్న 
చీకట్లను తొలగించి  జ్ఞాన జ్యోతిని వెలిగించటానికి ,దారి చూపటానికి 
తానే గురువై ,జగద్గురువై  దత్తాత్రేయ రూపమై ఇలలో అవతరించాడు 

సకల దేవతా స్వరూపం దత్తాత్రేయుడు 
సకల గురువులు దత్తాత్రేయ స్వరూపమే 

మనలోనే ఉన్న పరమాత్మను గుర్తించలేక పోవటానికి కారణం 
మన మనసుకు పట్టిన మాలిన్యమే 
ఈ మనో మాలిన్యాన్ని తొలగించగలిగే శక్తి 
మనసు చుట్టూ  ఉన్న అంధకారాన్ని తొలగించగలిగే జ్యోతి 
శ్రీ గురు దేవుల పాద ధూలియే

శ్రీ గురు దేవుల పాద పద్మముల ధూళి తో 
మన మనస్సు అనే అద్దాన్ని తుడిస్తే 
అప్పటి దాక మాలిన్యం తో నిండి నిన్ను నీకు 
చూపించ లేక పోయిన మనస్సనే అద్దం
నిన్ను నీకు సుస్పష్టంగా చూపించగలదు 
అప్పటి దాక ఎక్కడో ఉన్నడనుకునే దేవుడిని 
నీలోనే చూపించగలదు 

" తత్వమసి " అనే నిగూడమైన బ్రహ్మ జ్ఞానాన్ని 
కేవలం తన పాద ధూళితో అనుగ్రహించ గలడు

గురు దేవుల పాద ధూళి తాకనిదే భగవంతుడు లభ్యం కాడు
దైవాన్ని దేవుని గానే కొలవగలం 
కాని గురుదేవులు  ఏక కాలం లో 
"గురువు" గా " " దేవుని" గా అనుగ్రహించగలరు

అందువలన అందరమూ గురు దేవుల అనుగ్రహ ప్రాప్తి కై ప్రయత్నిద్దాము 

జై గురు దత్తా శ్రీ గురు దత్తా ..!!!