Wednesday, October 27, 2010

Story of Dattatreya


నారద మహా ముని సతీ అనసూయ యొక్క పాతివ్రత్య మహిమ ను గూర్చి ముగ్గురమ్మల ముందు వర్ణించెను ,వారు ఆమె పాతివ్రత్య మహిమను పరీక్షించ దలచి త్రిమూర్తులను వేడుకొనెను .


అత్రి మహాముని ఆశ్రమానికి త్రిమూర్తులు సాదు పుంగవుల వేషం లో  అతిధులు గా ప్రవేశించి
 " భవతి బిక్షాందేహి " అని అర్ధించారు .


అనసూయ మాత బిక్షను తీసుకు రాగ ,వారు నగ్న దేహి గా వడ్డిస్తేనే  బిక్ష గైకొనెదమని  మాత కు సెలవిచ్చెను .
పర పురుషుల ముందు నగ్నం గా వడ్డించటం పాతివ్రత్యానికి భంగం , అలా అని అతిధులను నిరాధరించటం మహా పాపం.


వచ్చిన వారు సామాన్యులు కాదని అనసూయ మాత గ్రహించెను ,"భవతి' అని పిలిచారు కావున వారు తన బిడ్డలతో సమానం .


మనసులో అత్రి మహా మునిని స్మరించుకొని తన పాతివ్రత్య మహిమచే ముల్లోకాలను పాలించే బ్రహ్మ- విష్ణు - మహేశ్వరులను పసిబిడ్డలు గా మార్చి ,నగ్నముగా  పాలించే ప్రభువులకు పాలిచ్చి వారిని ఉయ్యాలలో పరున్డబెట్టేను.


పతులను గానరాక అత్రి ఆశ్రమానికి వచ్చిన ముగ్గురమ్మలకు ఉయ్యాలలో పడుకొని ఆడుకుంటున్న తమ పతులు కనిపించారు.


శక్తి స్వరూపినులైన ముగ్గురమ్మలు తమ శక్తి తో త్రిమూర్తులను మామూలు రూపానికి తేవటానికి శతవిధాల ప్రయత్నించి విఫలులైనారు.అనసూయ మాత పాతివ్రత్యాన్ని గ్రహించి ఆమె మహత్యాన్ని వేన్నోళ్ల పొగిడి పతి బిక్ష పెట్టమని ప్రార్ధించారు .


అనసూయ మాత అనుగ్రహం తో మళ్ళీ త్రిమూర్తులు యథా రూపాన్ని పొందారు .ఆమె పతి భక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమన్నారు .ఆమె తన భర్త కోరిక తన కోరిక ఒకటే అని అదే త్రిమూర్తుల అంశతో బిడ్డను పొందాలనే కోరిక వెలిబుచ్చారు. వారు తథాస్తు అని దీవించారు .


బ్రహ్మ అంశ తో - సోముడు (చంద్రుడు) , విష్ణు అంశ తో - దత్తాత్రేయుడు , శివ అంశ తో - దుర్వాసుడు  ,అత్రి అనసూయ దంపతులకు జన్మించారు .

Monday, October 4, 2010

Guru brahma Guru Vishnu Gurudevo maheshwara



                                                                          

జై గురు దత్తా శ్రీ గురు దత్తా ,

కల్మష రహిత మైన ప్రార్ధన కి కరిగే కరుణా సముద్రుడు ,మన చుట్టూ ఆవరించి ఉన్న 
చీకట్లను తొలగించి  జ్ఞాన జ్యోతిని వెలిగించటానికి ,దారి చూపటానికి 
తానే గురువై ,జగద్గురువై  దత్తాత్రేయ రూపమై ఇలలో అవతరించాడు 

సకల దేవతా స్వరూపం దత్తాత్రేయుడు 
సకల గురువులు దత్తాత్రేయ స్వరూపమే 

మనలోనే ఉన్న పరమాత్మను గుర్తించలేక పోవటానికి కారణం 
మన మనసుకు పట్టిన మాలిన్యమే 
ఈ మనో మాలిన్యాన్ని తొలగించగలిగే శక్తి 
మనసు చుట్టూ  ఉన్న అంధకారాన్ని తొలగించగలిగే జ్యోతి 
శ్రీ గురు దేవుల పాద ధూలియే

శ్రీ గురు దేవుల పాద పద్మముల ధూళి తో 
మన మనస్సు అనే అద్దాన్ని తుడిస్తే 
అప్పటి దాక మాలిన్యం తో నిండి నిన్ను నీకు 
చూపించ లేక పోయిన మనస్సనే అద్దం
నిన్ను నీకు సుస్పష్టంగా చూపించగలదు 
అప్పటి దాక ఎక్కడో ఉన్నడనుకునే దేవుడిని 
నీలోనే చూపించగలదు 

" తత్వమసి " అనే నిగూడమైన బ్రహ్మ జ్ఞానాన్ని 
కేవలం తన పాద ధూళితో అనుగ్రహించ గలడు

గురు దేవుల పాద ధూళి తాకనిదే భగవంతుడు లభ్యం కాడు
దైవాన్ని దేవుని గానే కొలవగలం 
కాని గురుదేవులు  ఏక కాలం లో 
"గురువు" గా " " దేవుని" గా అనుగ్రహించగలరు

అందువలన అందరమూ గురు దేవుల అనుగ్రహ ప్రాప్తి కై ప్రయత్నిద్దాము 

జై గురు దత్తా శ్రీ గురు దత్తా ..!!!





Sunday, October 3, 2010

Saranam Charanam - Sri Guru Charanam

                                                           శరణం చరణం 




                                        శ్రీ గురు చరణ సరోజ రజ                                               
                                       నిజమన ముకురు సుధారి 
                                    
                             వరణౌ  రఘువర విమల జసు  జోదాయక ఫలచారి 
                            బుద్ధి హీనతను జానికై సుమిరౌ పవన కుమార్ 
                                      బల బుద్ధి విద్యా దేహు మోహి 
                                      హరహు కలేస బికార్


                                              శివోహం,
                                          గురుభ్యోం నమః
                                                                                                              
ఈ మాయా ప్రపంచం లో అజ్ఞాన అంధకారం లో దిక్కు తోచక దారి తెలియక 
నీ జాడ కనుగొన లేక ,ఆశ మోహాలకు లోనై,అరిషడ్వర్గాలకు బానిసై 
నీకు దూరమై ,జంతువులతో పోటీగా తిని తాగుతూ తుళ్ళుతూ 
సంసారం చేస్తూ , ఆ జంతువులకే అసహ్యం కలిగేలా జీవిస్తూ ,
క్షణిక సుఖాలకోసం వెంపర్లాడుతూ , అమృత తుల్యమైన మానవ జన్మను 
నరక ప్రాయం గా మార్చుకుంటూ ,బాధల్లో నిన్ను విమర్శిస్తూ 
సుఖాల్లో సత్ చిత్ ఆనంద స్వరూపుడవైన  నిన్ను విస్మరిస్తూ
ఈ గాడాంధకారం నిండి ఉన్న మనస్సుతో చరిస్తున్న నా పై 
నీ చల్లని వెన్నెల జల్లులతో ,లోకమంతా నీ వెలుగు నిండి ఉన్నా
గుర్తించలేని ఈ గుడ్డివాడిని కరుణిస్తూ, నీ కృపా దృష్టి తో నన్ను వీక్షించి 
నీ దివ్య మంగళ స్వరూపాన్ని చూసే మహాద్బాగ్యాన్ని ప్రసాదించు తండ్రీ ...!!!


ఈ జనన మరణ చక్రం నుండి విడివడే ,నీ సాయుజ్యాన్ని పొందే 
దారిని చూపి ధన్యుని చేయుము ప్రభో ...!!!


తుచ్చ మైన ఆలోచనలతో ఉన్న మనసుకు ,నీచమైన మాటలతో 
క్రుళ్ళిన లాలాజలం లో ఓల లాడుతూ ఉన్న నా  నాలుకకు 
సుగుణాభి రాముడివైన నిన్ను కీర్తించగలిగే భాగ్యాన్ని ప్రసాదించుము  దేవ దేవా...!!!